Share News

రక్తదానం చేసి ప్రాణదాతలుగా గుర్తింపు పొందండి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:41 PM

రక్తదానం చేసి ప్రాణదాతలుగా గుర్తింపు పొందాలని జిల్లా జడ్జి కుంచాల సనీత సూచించారు. కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్తం సమయానికి అందక ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్లం చేశారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా గుర్తింపు పొందండి

పెద్దపల్లి టౌన్‌, మార్చి 31 (ఆంఽధ్రజ్యోతి) రక్తదానం చేసి ప్రాణదాతలుగా గుర్తింపు పొందాలని జిల్లా జడ్జి కుంచాల సనీత సూచించారు. కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్తం సమయానికి అందక ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్లం చేశారు. ముఖ్యంగా తలసేమియాతో ఎందరో చిన్నారుల మరణిస్తున్నారన్నారు. బ్లడ్‌ కాం్యపు ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఉందని, అదే రోజు కోర్టుకు సెలవు ఉన్నందున 4న రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదే రోజు కోర్టు ప్రారంభోత్సవం ఉంటుందని, హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ హాజరవుతారన్నారు. ఉచిత వైద్య శిబిరం, రక్త దాన శిబిరం నిర్వహించనున్నట్లు వివరించారు. ఒక వ్యక్తి రక్తం ముగ్గురు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుందన్నారు. కోర్టు ఆవరణలో జరిగే ఈ కార్యక్రమాలకు ఉదయం 9 గంటలకు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి భవాని, జూనియర్‌ సివిల్‌ జడ్జి మంజుల, డీవీఎస్‌ మూర్తి కావేటి రాజగోపాల్‌, సూపరింటెండెంట్‌ శేఖర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:41 PM