Share News

వైద్యులు సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:46 PM

వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. గురువారం గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌ పేషెంట్‌ విభాగాలు, క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌, ఎక్స్‌రే, అల్ర్టా సౌండ్‌, ఫిజియోథెరపి, చిన్నపిల్లల విభాగాన్ని పరిశీలించారు.

వైద్యులు సమయపాలన పాటించాలి

కళ్యాణ్‌నగర్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. గురువారం గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌ పేషెంట్‌ విభాగాలు, క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌, ఎక్స్‌రే, అల్ర్టా సౌండ్‌, ఫిజియోథెరపి, చిన్నపిల్లల విభాగాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అదనంగా ఎక్స్‌రే మిషన్‌, అల్ర్టాసౌండ్‌, ఫిజియోథెరపి నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాన్ని చేపట్టాలని సూచించారు. సదరం విభాగంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని న్యూ బ్లాక్‌లో అవుట్‌ పేషెంట్‌ రూమ్‌లను పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ గోదావరిఖని అశోక్‌నగర్‌లో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మిస్తున్న ఎస్‌టీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ఆర్‌ఎంఓలు కృపాభాయి, దండె రాజు, అరుణ, నర్సింగ్‌ పర్యవేక్షకులు మృదులీన ఉన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:46 PM