Share News

యాసంగిలో వరి సాగు చేయవద్దు

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:35 PM

యాసంగి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

యాసంగిలో వరి సాగు చేయవద్దు

పెద్దపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని సాగు నిర్ణయాలు తీసుకోవాలని, అవసరమైతే పొలాలను బీడుగా ఉంచుకోవాలని తెలిపారు. వరి సాగుకు బదులుగా మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు సూచించాలని ఆదేశించారు. తక్కువ కాలంలో దిగుబడి వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి ముందస్తు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. దిగుబడి ఆధారంగా ధాన్యం సేకరణకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:35 PM