Share News

సుల్తానాబాద్‌లో జిల్లా స్థాయి జూడో పోటీలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:20 AM

జిల్లా క్రీడలు యువజన శాఖ, జిల్లా జూడో, రెజ్లింగ్‌ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో జిల్లా స్థాయి జూడో పోటీలను జిల్లా డీవైఎస్‌ఓ సురేష్‌ ప్రారంభించారు.

సుల్తానాబాద్‌లో జిల్లా స్థాయి జూడో పోటీలు

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడలు యువజన శాఖ, జిల్లా జూడో, రెజ్లింగ్‌ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో జిల్లా స్థాయి జూడో పోటీలను జిల్లా డీవైఎస్‌ఓ సురేష్‌ ప్రారంభించారు. శ్రీవాణి జూనియర్‌ కళాశాలలో సోమవారం నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు డీవైఎస్‌ఓ సురేష్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌ తదితరులు మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్‌లో జరుగునున్న సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్లు మంచి ప్రతిభను చాటుకుని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పీఈటీల సంఘం జిల్లా అద్యక్షులు కార్యదర్శులు సురేందర్‌, దాసరి రమేష్‌ శ్రీవాణి కళాశాల ప్రిన్సిపాల్‌ బండారి కమలాకర్‌, భైరోగని రవీందర్‌, జూడో సంఘం జిల్లా కార్యధర్శులు సిలివేరు మహేందర్‌, వంశీ, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్‌, పీడీలు దాసరి ప్రసాద్‌, సమ్మయ్య ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:20 AM