మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:29 AM
పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ సమస్య లను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ సమస్య లను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సం దర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణం లోని డ్రైనేజీల్లో ప్లాస్టిక్, చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్లపైకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు పనిచేయడం లేదని, శ్మశాన వాటికల్లో పిచ్చిమొక్కలు పెరిగిపో యాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూని యర్ కళాశాల మైదానాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, మున్సి పల్ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమస్య లను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యం లో ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చారు. మాజీ కౌన్సిలర్ భిక్షపతి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలకవర్గం హయాంలో పట్టణ అభి వృద్ధికి చేపట్టిన పనుల నిర్వహణపై ప్రస్తుత పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిం చారు. అనంతరం జెం డా చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బాకీ కార్డులు పంపిణీ చేశారు. కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, మాజీ కౌన్సిలర్లు పెంచాల శ్రీధర్, చంద్రశేఖర్, సరేష్‌బాబు, ఖదీర్ ఖాన్, రామగిరి చంద్ర మౌళి, ఎండీ ఫహీం పాల్గొన్నారు.