Share News

విద్యారంగ పరిరక్షణకు 5న ధర్నా

ABN , Publish Date - May 26 , 2026 | 11:37 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న విధానాల వల్ల విద్యారంగం రోజురోజుకు నిర్లక్ష్యానికి గురవుతుం దని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి రఘుశంకర్‌ రెడ్డి అన్నారు.

విద్యారంగ పరిరక్షణకు 5న ధర్నా

పెద్దపల్లి కల్చరల్‌, మే26(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న విధానాల వల్ల విద్యారంగం రోజురోజుకు నిర్లక్ష్యానికి గురవుతుం దని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి రఘుశంకర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా శాఖ సమావేశం ట్రినిటి డిగ్రీ కళాశా లలో బండి పరశురాములు అధ్యక్షతన జరిగింది. రఘుశంకర్‌ రెడ్డి మాట్లా డుతూ విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను ప్రోత్సహిస్తూ విద్యను ప్రభుత్వాలు ప్రశ్నార్ధకం చేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా వచ్చే నెల 5న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలన్నారు. జాతీయ విద్యా విధానం 2020 రాష్ట్రంలో అమలు చేయవద్దన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల స్థాపనను నిలిపివేయాలని, టీపీఎస్‌ పబ్లిక్‌ స్కూళ్ల స్థాపన మాను కోవాలని, ప్రస్తుతమున్న పాఠశాలలను సెమి రెసిడెన్షియల్‌ పాఠశాలలు గా మార్పు చేసి, అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కరపత్రాలను పోస్టర్లను ఆవిష్కరించారు. టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పోచయ్య, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌రెడ్డి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా సభ్యులు జీవన్‌రాజ్‌, కిషన్‌రావు, రమేష్‌, రాజయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:37 PM