Share News

1న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:47 PM

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను విరమించుకోవాలని ఏప్రిల్‌ 1న కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే ధర్నాకు తరలిరావాలని ఐఎఫ్‌టీయూ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా కార్మిక సంఘాల సమావేశం ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నరేష్‌ అధ్యక్షతన జరిగింది.

1న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

గోదావరిఖని, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను విరమించుకోవాలని ఏప్రిల్‌ 1న కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే ధర్నాకు తరలిరావాలని ఐఎఫ్‌టీయూ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా కార్మిక సంఘాల సమావేశం ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నరేష్‌ అధ్యక్షతన జరిగింది. ఐఎన్‌టీయూసీ నుంచి భూమల చందర్‌, ఏఐటీయూసీ నుంచి కడారి సునీల్‌, సీఐటీయూ నుంచి ఏ ముత్యంరావు, టీయూసీఐ నుంచి తోకల రమేష్‌, ఐఎఫ్‌టీయూ నుంచి అశోక్‌ హాజరై మాట్లాడారు. ఏప్రిల్‌ 1న ఆల్‌ డిపార్ట్‌మెంట్లు, కంపెనీలు, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, సింగరేణి కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాలో పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయడం లేదని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అబ్దుల్‌ కరీం, శనిగరపు చంద్రశేఖర్‌, సిపెల్లి రవీందర్‌, ఈసంపల్లి రాజేందర్‌, ఈదు నూరి రామకృష్ణ, ఐ రాజేశం, రాజేశ్వరరావు, ఎడ్ల రవికుమార్‌, మట్ల సమ్మయ్య, చింతల శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:47 PM