జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:01 AM
సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డ్ నిర్వహించాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయా లని శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరిఖని విఠల్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి ఆర్‌జీ-1 జీఎం కార్యా లయం వరకు ర్యాలీ చేపట్టారు.
గోదావరిఖని, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డ్ నిర్వహించాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయా లని శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరిఖని విఠల్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి ఆర్‌జీ-1 జీఎం కార్యా లయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి మాట్లాడుతూ కేసీ ఆర్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల ప్రయోజనం దృష్ట్యా అనేక ఇబ్బందులు, న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకొని కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించారన్నారు. కారుణ్య నియామకాల ద్వారా సుమారు 19వేల మంది యువ కులు సంస్థలో చేరారన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన కొంగ్రెస్ పార్టీ 26నెలలుగా మెడికల్ బోర్డ్ నిర్వ హించకపోవడం మూలంగా కార్మికులు నష్టపోతున్నార న్నారు. కారుణ్య నియామకాలు అనేవి అందని ద్రాక్షల తయారైందని, కార్మికులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. ఈ విషయంలో యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన కారుణ్య నియామకాలపై గందరగోళ పరిస్థి తులు ఏర్పడ్డాయన్నారు. గతంలో మెడికల్ బోర్డుకు పిలిచిన కార్మి కులను అన్‌ఫిట్, ఫిట్ చేయకుండా నెలల తరబడి కాలయాపన చేయ డంతో కార్మిక కుటుంబాలు ఆర్థి కంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా యన్నారు. అనేక హమీలు ఇచ్చి కార్మికుల ఓట్లు కొల్లగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్యం ఆచరణలో విఫల మైందన్నారు. టీబీజీకేఎస్ అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, బీఆర్‌ఎస్ నాయకులు జేవీ రాజు, పెంట రాజేష్, పున్నం శశి కుమార్, శంకర్, చింతకింది సంపత్, గడపురం కళ్యాణ్, టీబీజీకేఎస్ నాయకులు చెల్పూరి సతీష్, బొడ్డు రమేష్, పర్లపెల్లి అభిషేక్, చిక్కుడు శేఖర్, పాల్గొన్నారు.