అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:23 PM
మంథని ప్రాంతంలో చేపడు తున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గోదావరినది తీరంలో పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, మంథని-రామగుండం రహదారిపై హెలిప్యాడ్ పనులు, కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
మంథని, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మంథని ప్రాంతంలో చేపడు తున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గోదావరినది తీరంలో పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, మంథని-రామగుండం రహదారిపై హెలిప్యాడ్ పనులు, సమీ కృత డివిజన్ కార్యాలయాల భవన నిర్మాణాన్ని, ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. రామగిరి మండలంలోని పన్నూరు క్రాస్ రోడ్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఆయన మాట్లా డుతూ.. గోదావరి పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, 10 రోజుల్లోగా కాంక్రీట్ పనులు ప్రారంభిం చాలన్నారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లు, పొదలను తొలగించే పనులను వేగవంతం చేయాలన్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పుష్కరఘాట్ వద్ద ఫోర్‌లేన్ విస్తరణ పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. రహదారి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తూ, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలన్నారు. భక్తులకు, వాహనదా రులకు ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. మంథని-రామగుండం రహదారిపై ఉన్న హెలిప్యాడ్‌ను గోదావరి పుష్కరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేపట్టాలన్నారు. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. సమీకృత డివిజన్ కార్యాలయాల భవన నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. మంథని మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్ సింగ్, ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.