Share News

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:56 PM

పెద్దప ల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి, ఆసుపత్రి ప్రారంభం నాటికే అన్ని వైద్య పరికరాలు, విద్యుత్‌, నీరు తదితర మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంఽధ్రజ్యోతి) పెద్దప ల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి, ఆసుపత్రి ప్రారంభం నాటికే అన్ని వైద్య పరికరాలు, విద్యుత్‌, నీరు తదితర మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచిం చారు. టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్‌, అధికారులు, పాల్గొన్నారు

తరగతి గదుల పను పరిశీలన

పెద్దపల్లి కల్చరల్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ లోని ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళా శాలలో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధనకు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. ఈ నెలా ఖరులోగా పనులు పూర్తి చేయాలని కలె క్టర్‌ ఆదేశించారు. నాణ్యతతో పాటు నిర్ణీత గడువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతీ విద్యార్థికి అవసరమైన పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలోగా సిలబస్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అదనపు బోధన, సహాయాన్ని అందించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలని అధికారులను, ఉపాధ్యాయులను కోరారు.

Updated Date - Sep 11 , 2026 | 11:56 PM