అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:19 AM
ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఖాన్‌సాయి పేట, వెంకటాపూర్, మల్లారం, స్వర్ణపల్లి భట్టుపల్లి, ప్రాథమిక పాఠశాలలతోపాటు ఆరెంద జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు.
మంథనిరూరల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఖాన్‌సాయి పేట, వెంకటాపూర్, మల్లారం, స్వర్ణపల్లి భట్టుపల్లి, ప్రాథమిక పాఠశాలలతోపాటు ఆరెంద జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యాబోధన, హాజరు, అభ్యసన స్థాయిపై సంబంధిత అధికా రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపూర్ నుంచి ఆరెంద వనకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వెంటనే ప్రారం భించాలని అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థికి కనీస విద్యా నైపుణ్యాలు కల్పించాలని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఉపాధ్యాయులు ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్ఠి సారించి ప్రతీ విద్యార్థికి కనీసం చదవడం, రాయడం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రాథమిక గణిత నైపుణ్యాలు ఉండేలా బోధన అందించాలని ఆదేశించారు. ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఏఈ పి ఆర్ జగదీశ్, ఎంపిఓ షబ్బీర్ పాషాలు పాల్గొన్నారు.