Share News

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:09 AM

అభివృద్ధి పనులను సకాలంలో గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టర్‌ రామగిరి మండలం, మంథని పట్టణ పరిఽధిలో విస్తృతంగా పర్యటిం చారు. రామగిరి మండలంలోని కేజీబీవీ విద్యాల యం, తహసీల్దార్‌ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కేజీబీవీలో ఏర్పాటు చేసిన మాడ్యులర్‌ కిచెన్‌ను ప్రారంభించారు.

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

మంథని/రామగిరి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులను సకాలంలో గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టర్‌ రామగిరి మండలం, మంథని పట్టణ పరిఽధిలో విస్తృతంగా పర్యటిం చారు. రామగిరి మండలంలోని కేజీబీవీ విద్యాల యం, తహసీల్దార్‌ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కేజీబీవీలో ఏర్పాటు చేసిన మాడ్యులర్‌ కిచెన్‌ను ప్రారంభించారు. సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన స్టీమ్‌ రైస్‌ బాయిలర్‌, ఆటోమేటిక్‌ రోటిమేకర్‌, ఇడ్లీ బాయిలర్‌, ఎల్‌పీజీ గ్యాస్‌లైన్‌ ప్రారంభించారు. కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. మంథని పట్ట ణంలోని సంగీత పాఠశాల, మున్సిపల్‌ కార్యా లయ, జూనియన్‌ బాయ్స్‌ స్కూల్‌, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మంథని పట్ట ణంలోని షెడ్యూలు కులాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పట్టణంలోని సంగీత స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సూచనల మేరకు అభివృద్ధి పనులను 15 రోజులలో పూర్తి చేయాలని కలె క్టర్‌ సూచించారు. నూతనంగా నిర్మాణ పనులు నిర్ధిష్ట గడువులోగా పూర్తయ్యే విధంగా చూడాలని కలె క్టర్‌ ఆదేశించారు. మంథని జూని యర్‌ కళాశాలలో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్న ద్ధం చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ రిన్నో వేషన్‌లో భాగంగా పెయింటింగ్‌, అంతర్గత రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంటగా రామగిరి తహసీల్దార్‌ సుమన్‌, మం థని మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, టీజీఎం ఎస్‌ఐడీసీ ఈఈ విక్రమ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ శంకరయ్య, ఏఈలు అనుదీప్‌, వరలక్ష్మి, సంబంధిత అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:09 AM