Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:18 AM

మండలంలో అమ లవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో వేగవంతంగా పని చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

మంథని, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): మండలంలో అమ లవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో వేగవంతంగా పని చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాల యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. వీబీజీ-రామ్‌జీ పథకం కింద చేపడు తున్న జలసిరి, ఇంకుడు గుంతలు, పంటకుంటలు, ఇతర సహజ వనరుల అభివృద్ధి పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయో జనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యా చరణ చేపట్టాలని, రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించాలన్నారు. యూరియా పంపిణీ పార దర్శకంగా జరిగేలా పర్యవేక్షించడంతో పాటు సేంద్రియ సాగు విధానాలపై రైతులను మరింతగా ప్రోత్సహించా లన్నారు. మిషన్‌ భగీరథ పరిధిలో నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న సమస్యలను గ్రామాల వారీగా గుర్తించి, శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్య లను శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరి ష్కారానికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాల న్నారు. మండల ప్రత్యేక అధికారి పూర్ణచందర్‌, పీఏసీ ఎస్‌, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీనివాస్‌, కుడుదుల వెం కన్న, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషణ్‌ కాచే, ఆర్‌టీఏ మెంబర్‌ మంథని సురేష్‌, ఎంపీడీవో శ్రీజరెడ్డి, తహసీ ల్దార్‌ ఆరిఫోద్దీన్‌, అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:18 AM