Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 09 , 2026 | 11:43 PM

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ పేదలను పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం అడవిశ్రీరాంపూర్‌లో మంత్రి పర్య టించారు. గ్రామంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవే శంలో పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ముత్తారం, మే 9 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ పేదలను పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం అడవిశ్రీరాంపూర్‌లో మంత్రి పర్య టించారు. గ్రామంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవే శంలో పాల్గొన్నారు. దరియాపూర్‌ మోడల్‌ స్కూల్‌లో రూ.1.30 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూంలు ఇస్తామని మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అర్హులైన వారం దరికి ఇం దిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. మంథని నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజి, సర్పంచ్‌ కొట్టె అన్నపూర్ణ ఉపేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అల్లాడి యాదగిరి రావు, కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మద్దెల రాజయ్య, మాజీ జడ్పిటిసి జగన్‌ మోహన్‌ రావు, మాజీ ఎంపిటిసి దొడ్డ గీత రాణి, పార్టీ మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మ, నాయకులు వాజీద్‌ పాషా, గాధం శ్రీనివాస్‌, అల్లం కుమారస్వామి, వినీత్‌, బియ్యని శివకుమార్‌, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 11:43 PM