ఆధారాలతోనే 22ఏ భూములపై నిర్ణయాలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:10 AM
22ఏ నిషేధిత భూములకు సం బంధించి పూర్తి ఆధారాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చే సందర్భంలో స్పష్టమైన ఆధారాలు ఉండాలని, అదే విధానాన్ని భూముల తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు.
పెద్దపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): 22ఏ నిషేధిత భూములకు సం బంధించి పూర్తి ఆధారాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చే సందర్భంలో స్పష్టమైన ఆధారాలు ఉండాలని, అదే విధానాన్ని భూముల తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 22ఏ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యా దులు, భూముల రికార్డుల పరిశీలన, నిషేధిత జాబితాలో చేర్చడం, తొల గింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లా డుతూ పొరపాటున ఏదైనా ప్రెవేట్ భూమి 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్టు రూపొందించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. తొలగించే ప్రతీ సర్వే నంబర్‌కు నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిజమైన ప్రైవేట్ భూములకు సంబంధించిన సమస్యలను 48 గంటల్లో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల పరి రక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని, 22ఏ జాబితాలో భూము లను చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియల్లో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానాన్ని, ఒకే ఫార్మాట్‌ను అమలు చేయాలని ఆదేశించారు. 22ఏ భూములకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా పారదర్శకంగా, వేగంగా వ్యవహరించాలని సూచిం చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భూముల హక్కులు, స్వభావానికి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.