సుల్తానాబాద్‌లో బధిరుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:23 PM
స్నేహభావం, క్రీడా స్పూర్తిని చాటి చెప్పే లక్ష్యంతో జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా బధిరుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన వినికిడి, వాక్కు ఉన్న క్రీడాకా రులు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.
సుల్తానాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్నేహభావం, క్రీడా స్పూర్తిని చాటి చెప్పే లక్ష్యంతో జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా బధిరుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన వినికిడి, వాక్కు ఉన్న క్రీడాకా రులు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. మూగ, చెవిటి వారైనా ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఈ మ్యాచ్ ద్వారా క్రీడాకారులు నిరూపించారు. నిర్వాహకులు మాట్లాడుతూ బధిరుల్లో దాగిన క్రీడా ప్రతిభను వెలికితీయడం తోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. బదిరుల అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీని వాస్, మంచిర్యాల జిల్లా అసోసి యేషన్ అధ్యక్షుడు దేవయ్య, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి, ప్రధాన కార్యదర్శి భూపా ల్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.