Share News

యువతపై సైబర్‌ వల

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:38 AM

కరీంనగర్‌కు చెందిన ఒక యువకుడు తన ఇంటిలోనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం ద్వారా సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్‌ నెలలో అతని బ్యాంక్‌ ఖాతా నుంచి 98 వేల రూపాయలు సంతోష్‌కుమార్‌ బహేలి అనే గుర్తుతెలియని వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు బాధితుడికి బ్యాంక్‌ నుంచి మెస్సేజ్‌ వచ్చింది. అయితే తాను ఎలాంటి లింక్‌లు, మెస్సేజ్‌లు ఓపెన చేలేదని, బ్యాంక్‌ లావాదేవీలు కూడా జరపలేదని బాధితుడు పోలీసులకు తెలిపాడు.

యువతపై సైబర్‌ వల

కరీంనగర్‌ క్రైం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

కరీంనగర్‌కు చెందిన ఒక యువకుడు తన ఇంటిలోనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం ద్వారా సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్‌ నెలలో అతని బ్యాంక్‌ ఖాతా నుంచి 98 వేల రూపాయలు సంతోష్‌కుమార్‌ బహేలి అనే గుర్తుతెలియని వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు బాధితుడికి బ్యాంక్‌ నుంచి మెస్సేజ్‌ వచ్చింది. అయితే తాను ఎలాంటి లింక్‌లు, మెస్సేజ్‌లు ఓపెన చేలేదని, బ్యాంక్‌ లావాదేవీలు కూడా జరపలేదని బాధితుడు పోలీసులకు తెలిపాడు. వెంటనే బ్యాక్‌కు వెళ్లి స్టేట్‌మెంట్‌ పరిశీలించగా ఈ విషయం తెలిసింది.

కరీంనగర్‌ వావిలాలపల్లికి చెందిన తిరుపతి ప్రమేయం లేకుండానే ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతా నుంచి 94,999 రూపాయలు ఇతర ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ విషయమై బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా అతని ఫోనలో పీఎం యోజన ఏపీకే ఫైల్‌ ఇనస్టాల్‌ చేసి ఉందని, ఆ ఫైల్‌ ద్వారానే సైబర్‌ నేరస్థులు తిరుపతి బ్యాంక్‌ ఖాతా నుంచి మూడు దఫాలుగా ఈ డబ్బులు ఇతర ఖాతాలకు బదిలీ చేశారని బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు.

మెస్సేజ్‌లు, ఆనలైన లింక్‌లు ఓపెన చేసిన మరుక్షణంలో బ్యాంక్‌ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ఆనలైనలో వల వేస్తూ స్పందించిన వ్యక్తుల ఖతాలను నిమిషాలలో ఖాళీ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. ప్రస్తుత అత్యాధునిక సాంకేతికత అందివచ్చిన రోజుల్లో ఒక మొబైల్‌ చేతిలో ఉంటే చాలు ప్రపంచం చుట్టిరావచ్చు. అందివచ్చిన ఇదే సాంకేతికను కొందరు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు ఉపయోగిస్తూ యువత, సామాన్యులు మొదలుకొని విద్యావంతులు, మేధావులను కూడా బోల్తాకొట్టిస్తున్నారు. బ్యాంక్‌ లావాదేవీలు, ఆనలైన షాపింగ్‌, ఆర్‌టీఓ ఫీజులు, పన్నులు చెల్లింపు, మున్సిపల్‌ టాక్స్‌, విద్యుత బిల్లులు, ఎల్‌ఐసీ, రుణాలు వంటి సేవలు మొబైల్‌ ఫోన ద్వారా ఇంటిలో కూర్చుని పనిపూర్తి చేసే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఆ సాంకేతికతనే సైబర్‌ నేరగాళ్లకు తిరుగులేని ఆయుధం కూడా అవుతోంది. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్టవేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. డిజిటల్‌ చెల్లింపులు, స్మార్ట్‌ఫోన వినియోగం పెరగడంతో పాటు, కృత్రిమ మేధస్సు(ఏఐ), డీప్‌ఫేక్‌ టెక్నాలజీ వంటివి సైబర్‌ నేరగాళ్లకు అండగా నిలుస్తున్నాయి. వాట్సప్‌, టెలిగ్రాం వంటి సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

ఆకర్షణీయమైన మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు

అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా ఎర వేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని వారి కష్టార్జితాన్ని దోచుకోవడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, ఆకర్షణీయమైన మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు, సోషల్‌ మీడియా వేదికల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింక్‌లను పంపి ప్రజలను మోసం చేస్తున్నారు. కన్స్యూమర్‌ ప్రొటెక్షన పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు నటిస్తూ వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను సేకరిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇనస్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు కొన్ని ప్రొఫైల్స్‌ను రూపొందించి, వాటిని వైరల్‌ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్‌, రిఫెరల్‌ బోనస్‌, బెట్టింగ్‌ వంటి ఆశలు చూపి అమాయకులను మోసం చేస్తున్నారు. హనీ ట్రాప్‌, డిజిటల్‌ అరెస్టు వంటి సైబర్‌ నేరాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌ల పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయి. రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్న ముఠాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి బ్యాంకు సిబ్బందితో కూడా కుమ్మక్కవుతున్నారని కొన్ని సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. లక్కీ డ్రాలో డబ్బులు గెలిచారని వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పైజ్ర్‌మనీ, రుణాలు మంజూరు పేరుతో ఎరవేసి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సైబర్‌ నేరాలపై 1930కు పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 2023లో 302 సైబర్‌ కేసులు, 2024లో 208 కేసులు, 2025లో 276 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. మూడేళ్ల కాలంలో మొత్తం 786 సైబర్‌ కేసులు నమోదయ్యాయి.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత మూడు సంవత్సరాలలో జరిగిన సైబర్‌ నేరాలు

---------------------------------------------------------------------------

క్రైం హెడ్‌ 2023 2024 2025 మొత్తం

---------------------------------------------------------------------------

యూపీఐ మోసం 189 90 182 461

ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ 76 64 48 188

ఏటీఎం కార్డు మోసం 23 22 19 64

ఈ-వాలెట్‌ మోసం 1 12 12 25

డీమాట్‌ మోసం 6 11 11 28

ఫ్రాడ్‌ కాల్‌ 7 4 4 15

బిజినెస్‌ ఈ మెయిల్‌ 0 3 0 3

ఇతర రకం కేసులు 0 2 0 2

-------------------------------------------------------------------------------

మొత్తం 302 208 276 786

-------------------------------------------------------------------------------

Updated Date - Jul 12 , 2026 | 12:38 AM