సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:35 AM
లంగాణ ప్రజలకు ప్రత్యేకమైన బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను ప్రభుత్వ విప్ ప్రారంభించారు.
ఓదెల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను ప్రభుత్వ విప్ ప్రారంభించారు. అలాగే రూ.26 లక్షలతో పూర్తయిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఓదెల గ్రామ పంచాయతీ ప్రహరి, బతుకమ్మ ఘాట్, సీసీ రోడ్లు, పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు వీధుల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పిట్టల రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, బోడకుంట శంకర్, చొప్పరి రాజన్న, బోడకుంట కుమారస్వామి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఉప సర్పంచ్ గోపతి ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.