Share News

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:56 PM

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన బ్రమరాంభ మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో కోడె మొక్కులు, మల్లన్నకు బోనాలు, ఒగ్గు పూజారులతో పట్నాలు వేసి మొక్కులు సమర్పించారు.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

ఓదెల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన బ్రమరాంభ మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో కోడె మొక్కులు, మల్లన్నకు బోనాలు, ఒగ్గు పూజారులతో పట్నాలు వేసి మొక్కులు సమర్పించారు. పొత్కపల్లి ఎస్‌ఐ రమేష్‌ తో పాటు పలువురు ఆలయంలో అర్చనలు నిర్వహించారు. సిద్దిపేట, ఆదిలాబాద్‌, జనగామ, భూపాలపల్లి జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి దర్శనం కోసం మూడు గంటల పాటు లైన్‌లో వేచి ఉన్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహి స్తూ శివసత్తుల పూనకాలతో సందడిగా మారింది.

Updated Date - Apr 05 , 2026 | 11:56 PM