పంట మార్పిడితోనే రైతులకు అధిక దిగుబడి
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:14 AM
పం టలను మార్పిడి చేయడం ద్వారానే రైతులకు ఆశాజనకంగా దిగుబడులు పెరిగి లాభాలను పొందుతారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మం డలంలోని వడుకాపూర్, కాచాపూర్, వెంక ట్రావుపల్లి, కీచులాటపల్లి, బాల్‌రాజ్‌పల్లి గ్రామా ల్లో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రా లను మంగళవారం ప్రారంభించారు.
జూలపల్లి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పం టలను మార్పిడి చేయడం ద్వారానే రైతులకు ఆశాజనకంగా దిగుబడులు పెరిగి లాభాలను పొందుతారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మం డలంలోని వడుకాపూర్, కాచాపూర్, వెంక ట్రావుపల్లి, కీచులాటపల్లి, బాల్‌రాజ్‌పల్లి గ్రామా ల్లో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రా లను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధికి కాం గ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభు త్వంలో జరిగిన విదంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను తాలు,తప్ప పేరిట కోతలు విధించి కటింగ్‌ల పేరుతో దోచుకున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం కొను గోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి మోసాలు జరుగకుండా పారదర్శకంగా వ్యవహరిస్తుంద న్నారు. వానాకాలం సీజన్‌లో రైతులు పండిం చిన సన్నరకం ధాన్యానికి బోనస్ అందిం చామన్నారు. తహ సీల్దార్ దత్తుప్రసాద్, గిర్దవరి మల్లికార్జున్ రావు, సిఈఓ రవిం దర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మొగురం రాజేశం, కోరుకంటి హరికిషన్, వార్డు సభ్యులు, నాయకు లు పుల్లూరి వేణు గోపాల్‌రావు, జెట్టి సతీష్, వేల్పుల చిన్నలింగయ్య, వేల్పుల గట్టయ్య, అబ్బెంగుల రాజారాం, నమిలికొండ ఆగయ్య, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, వేల్పుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.