సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:39 PM
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని, ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం పెన్షన్ విద్రోహ దినం-చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిం చారు. టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని, ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం పెన్షన్ విద్రోహ దినం-చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిం చారు. టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదలతో పాటు ఉద్యోగుల ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 10న హైదరాబా ద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేస్తామని హెచ్చరించారు.
టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్ తూము రవీందర్ మాట్లాడుతూ జిల్లాలోని 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాలు ఐక్యంగా నిరసనలో పాల్గొ న్నాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్య త్తును అనిశ్చితిలోకి నెట్టే సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని అమలు చేసి ఉద్యోగు లకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తహసీల్దార్ స్వర్ణ, డీవైఎస్‌వో లింగారెడ్డి మారం, నాయబ్ తహసీల్దార్లు రాకేష్, లక్ష్మి, సీనియర్ సహాయకులు అంజన్న, స్వర్ణలత, సంపత్, ఉదయశ్రీ, వరలక్ష్మి, టీజీఓ జిల్లా కార్యదర్శి గండు సురేష్, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగుల వైద్య పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య కార్డుల ద్వారా అందించే వైద్య పరిమితిని ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని టీఎన్‌జీవోల కేంద్ర సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి 1.5 శాతం కాంట్రిబ్యూషన్ తీసుకుంటూ కేవలం రూ.3 లక్షల పరిమితి విధించడం అన్యాయమన్నారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై అన్ని ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని, కార్డులను గౌరవించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హమీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.