Share News

లోక్‌ అదాలత్‌తో సమన్యాయం

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:07 AM

లోక్‌ అదాలత్‌లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించారు.

లోక్‌ అదాలత్‌తో సమన్యాయం

సుల్తానాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించారు. జడ్జి మాట్లాడుతు లోక్‌అదాలత్‌లలో ఇరువర్గాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్‌అదాలత్‌ తీర్పులు తుది తీర్పులకు అప్పీలు ఉండదని గుర్తు చేశారు. పలు క్రిమినల్‌, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, చెక్‌ బౌన్స్‌, డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులకు సంబంధించి కేసులు పరిష్కరించారు. వృద్ధులను, రిటైర్డు ప్రభుత్వ ఉపాధ్యాయులను జడ్జి సన్మానించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్‌, ఏజీపీ దూడం అంజనేయులు, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నేరెళ్ళ శంకరయ్య, లోక్‌అదాలత్‌ మెంబర్‌ మాడూరి ఆంజనేయులు, సంతోష్‌, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, న్యాయవాదులు, కోర్టు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:07 AM