రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు కృషి
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:17 AM
సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి పని చేస్తున్నాయని, ప్రతీ పంట సీజన్‌లో వారికి రుణాలు అందజేస్తున్నాయని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాదాక్రిష్ణ అన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం సంఘ భవన ఆవరణలో నిర్వహించారు.
సుల్తానాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి పని చేస్తున్నాయని, ప్రతీ పంట సీజన్‌లో వారికి రుణాలు అందజేస్తున్నాయని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాదాక్రిష్ణ అన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం సంఘ భవన ఆవరణలో నిర్వహించారు. సహకార శాఖ జిల్లా అసిస్టెంట్ రిజిస్ర్టార్ ఎన్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి 26 వరకు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను సభలో ఉంచారు. అలాగే 2026 -27 సంబంధించిన అంచనా బడ్జెట్‌తో పాటు పలు అంశాలతో కూడిన తీర్మానాలను ఆమోదించారు. మున్సిపల్ చైర్మన్ క్రిష్ణ మాట్లాడుతు సహకార సంఘం ద్వారా అందుతున్న సేవలను కొనియాడారు. సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ర్టార్ ఎన్ వెంకటేశ్వర్లు, సీఈఓ బూరుగు సంతోష్ మాట్లాడుతు సంఘం రైతులకు సీజన్‌ల వారీగా వివిధ రుణాలు, రైతుల కోసం సూపర్‌మార్కెట్‌ను నిర్వహిస్తుందని, వాటర్ ప్లాంట్ ద్వారా తాగునీటిని అందిస్తుందని అన్నారు. త్వరలో నీరుకుళ్లలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సహకార సంఘం తరపున మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించారు. సంఘం డైరక్టర్లు, సభ్యులు, రైతులతో పాటు మార్కెట్ డైరక్టర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేద్దాం
ఎలిగేడు, 0(ఆంధ్రజ్యోతి): రైతన్నలను ఆదుకొని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చెద్దామని పర్సనల్ ఇంచార్జి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 136వ సర్వసభ్య సమావేశం కార్యదర్శి కేశెట్టి విక్రమ్ అధ్యక్షతన జరిగింది. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సహకార సంఘంలో 2274 మంది సభ్యులు ఉండగా, వాటా దనము రూ.1,61,48,992 బ్యాంకులో ఉందన్నారు. , 2024-25 ఆడిట్ రిపోర్టు ప్రకారం మొత్తం ఆదాయం 56,96, 367 కాగా సంఘం నికర లాభం రూ.1,97,586.33తో ఏ గ్రేడ్‌లో ఉందన్నారు. 40 డ్రోన్ స్పెయర్లు, 5 వేల మెట్రిక్ టన్నులను మూడు సంఘాలు కలిసి గోదాం నిర్మాణం, స్ర్టాంగ్, గోల్డ్‌లోన్ ఇచ్చుటకు, సంఘ భూముల్లో పెన్సింగ్ వేయడానికి తీర్మానించినట్లు పేర్కొన్నారు.