Share News

షాపుల కూల్చివేతపై ముదిరిన వివాదం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:11 AM

గోదావరిఖని ఎల్‌బీనగర్‌లోని నర్సింగ్‌ కళాశాల ప్రహరీ పక్కన నిర్మిస్తున్న షాపులను కూల్చివేయడంపై వివాదం ముదురుతోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా గణపతి మండపంతోపాటు అక్కడ ఉపాధి పొందుతున్న కొందరు చిరు వ్యాపారులు నష్టపోతున్నారు.

షాపుల కూల్చివేతపై ముదిరిన వివాదం

కోల్‌సిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఎల్‌బీనగర్‌లోని నర్సింగ్‌ కళాశాల ప్రహరీ పక్కన నిర్మిస్తున్న షాపులను కూల్చివేయడంపై వివాదం ముదురుతోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా గణపతి మండపంతోపాటు అక్కడ ఉపాధి పొందుతున్న కొందరు చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా ప్రహరీ పక్కన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు రెట్టింపు నిర్మాణాలు చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. చిన్న షాపునకు రూ.3.6లక్షలు వసూలు చేస్తున్నారంటూ వివా దం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో నగరపాలక సంస్థ కొన్ని నిర్మాణాల పిల్లర్లను తొలగించింది. దీనిపై సీపీఐ కార్పొరేటర్‌ మార్కపురి సూర్య కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశారు. దీనిపై శనివారం ఎన్‌ఎస్‌ యూఐ నాయకుడు మెంటం ఉదయ్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆరు షాపులకు 12 షాపులు నిర్మించే ప్రయత్నం చేశారని, అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించారంటూ ఆరోపించారు. ఈ షాపుల పేర రూ.38లక్షలు వసూలు చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ నిర్మా ణాలు అక్రమమని, వాటిని తొలగించాలంటూ శనివారం సింగరేణి నోటీ సులు అంటించింది. దీనిపై కార్పొరేటర్‌ సూర్య ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీనికి ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. బాధితు లైన నిర్వాసితులకు నిర్మాణాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అదనపు నిర్మాణాలు జరుగు తున్నాయనే ఆరోపణలు మొదటికే మోసం తెస్తున్నాయి.

Updated Date - Aug 09 , 2026 | 12:11 AM