రామగుండం అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:53 PM
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకరించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగ రేణి డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్యనారా యణ, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, మేయర్ మహంకాళి స్వామితో సమా వేశం నిర్వహించారు.
గోదావరిఖని, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకరించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగ రేణి డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్యనారా యణ, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, మేయర్ మహంకాళి స్వామితో సమా వేశం నిర్వహించారు. సింగరేణి ప్రాంతం, ప్రభావిత ప్రాంతాల్లో సంక్షేమం, అభి వృద్ధికి యాజమాన్యం సహకరించాలని, అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ర్యాపిడ్ ఫిల్డర్ బెడ్ పనుల్లో జాప్యం వల్ల కార్మిక కుటుం బాలకు శుద్ధ జలాలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పూర్తి చేయడంలో అలసత్వం సరికాదన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి అడ్డంకులు సృష్టించడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతున్నారన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపనుల్లో జాప్యం ఏర్పడుతుందన్నారు. అభివృద్ధి పనులకు స్థలాలు కేటాయించడం, అను మతులు ఇవ్వడంలో జాప్యం వల్ల వివా దాలు తలెత్తుతున్నాయని, అవసరమైన పనులు జరుగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధిలో మున్సి పల్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వ యంతో పని చేయాలని కోరారు. తహసీ ల్దార్ కే రవీందర్‌రావు, ఏసీపీ రమేష్, ఆర్‌జీ-2 జీఎం లక్ష్మీపతిగౌడ్, నాయకులు సింగరేణి శ్రీనివాస్, దీటి బాలరాజు పాల్గొన్నారు.