Share News

విద్యార్థుల అభ్యసన ప్రగతిపై నిరంతరం పర్యవేక్షించాలి

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:55 PM

విద్యా ర్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖనిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏడు మండ లాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్‌ శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు.

విద్యార్థుల అభ్యసన ప్రగతిపై నిరంతరం పర్యవేక్షించాలి

కోల్‌సిటీటౌన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖనిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏడు మండ లాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్‌ శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు. విద్యార్థుల సామర్ధ్యాలు మెరుగుపరిచేందుకు రెమి డియేషన్‌ తరగతులు, ఖాన్‌ అకాడమీ పాఠాలు, ఎఫ్‌ ఎల్‌ఎన్‌ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాల న్నారు. ఖాన్‌ అకాడమీలో విద్యార్థుల నమోదు, డిజిటల్‌ పాఠాల వినియోగం, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వినడంతో పాటు నేర్చుకున్న అంశాలను అర్థం చేసుకొని స్వయంగా మాట్లాడేలా, తమ అభిప్రాయా లను వ్యక్తపరిచేలా బోధనా పద్ధతులను అనుసరించా లన్నారు. తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థులు ఎదు ర్కొంటున్న అభ్యసన లోపాలను అధిగమించేలా రెమిడి యేషన్‌ తరగతులను సమర్థవంతంగా నిర్వహించాల న్నారు. ఖాన్‌ అకాడమీలో విద్యార్థుల నమోదు ప్రక్రి యను పూర్తి చేయడంతోపాటు, డిజిటల్‌ పాఠాల ద్వారా వారు సాధిస్తున్న అభ్యసన ప్రగతిని పర్యవేక్షించాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా విద్యాధికారి జీ శారద, ఏఎంఓ డాక్టర్‌ పీఎం షేక్‌, మండల విద్యాధికారులు, ఆలోకిట్‌ ప్రతినిధులు ప్రమోద్‌, సమీద్‌, పాఠశాలల తనిఖీ బృందం నాయకుడు సీహెచ్‌ ఆగయ్య, డీఆర్‌పీలు గడ్డం జగదీశ్వర్‌, కృష్ణమోహన్‌, జే శ్రీనివాస్‌, ఏ శ్రీనివాస్‌, రమేష్‌, మంజుల, జ్యోతి, రవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:55 PM