Share News

రౌడీషీటర్లపై నిరంతర నిఘా పెట్టాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:51 PM

పోలీస్‌ స్టషన్ల నిర్వహణలో క్రమశిక్షణ, నేర నియంత్రణలో నిరంతర నిఘా తప్పనిసరిగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన రామగుండం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రౌడీషీటర్లపై నిరంతర నిఘా పెట్టాలి

అంతర్గాం, నవంబరు6(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టషన్ల నిర్వహణలో క్రమశిక్షణ, నేర నియంత్రణలో నిరంతర నిఘా తప్పనిసరిగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన రామగుండం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ హరి శేఖర్‌తో కేసుల నమోదు, ఈ సాక్ష్య, ఈ సమన్ల అమలు, అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులతో సమన్వయం చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన కేసుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్‌ రైటర్లతో సహా ప్రతి పోలీస్‌ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పీఎం రాహత్‌ పథకంపై ముందుగా పోలీస్‌ సిబ్బందికి, అనంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రామగుండం సీఐ కృష్ణ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:51 PM