Share News

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాటం

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:00 AM

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీ వరకు సేవ్‌ డెమొక్రసీ వీక్‌ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. శుక్రవారం క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాటం

గోదావరిఖని, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీ వరకు సేవ్‌ డెమొక్రసీ వీక్‌ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. శుక్రవారం క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని నిరసనలు చేపట్టినట్టు పేర్కొన్నారు. సర్‌ కార్యక్రమంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ కేంద్రానికి ఏజంట్‌గా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించారు. ఓటును కాపాడడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడమేన్నారు. ఇండీ కూటమి నిర్ణయం మేరకు వారం రోజుల పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం వారంగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఓటును కాపాడండి, దేశాన్ని కాపాడండి పేరుతో భారీ మార్చ్‌లు నిర్వహించనున్నట్టు తెలిపారు. భాగ స్వామ్య పార్టీలతో సమావేశాలు, సన్నా హక సమావేశాలు, కార్యకర్తల సమీకరణ, కూటమి పార్టీలతో కలిసి జిల్లా స్థాయి మార్చ్‌ నిర్వహించి అంబేద్కర్‌, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్ర మాలు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్ర మాలలో పార్టీ ప్రజా ప్రతినధులు, నాయ కులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలు పునిచ్చారు. కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, మేయర్‌ మహంకాళిస్వామి, డిప్యూటీ మేయర్‌ ఎల్లయ్య, నాయకులు రవికుమార్‌, బొంతల రాజేష్‌, నెలకంటి రాము, మారెల్లి రాజిరెడ్డి, దీటి బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:00 AM