Share News

కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:23 AM

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలని మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి యుగంధర్‌ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు.

కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలని మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి యుగంధర్‌ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ దళిత నాయకుడైన స్పీకర్‌పై వ్యాఖ్యలుచేయడం దళిత సమాజాన్ని అవమానించడమేనన్నారు. మధును వెంటనే బర్తరఫ్‌ చేయాలని, స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని కేసీఆర్‌ విస్మరించారన్నారు. దళిత నాయకుడు స్పీకర్‌గా ఉన్నాడనే కారణం తో కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదన్నారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్‌ అధ్యక్షుడు నగర బొంతల రాజేష్‌, నాయకులు కాల్వ లింగస్వామి, రవికుమార్‌, తిప్పారపు శ్రీనివాస్‌, దీటి బాలరాజు, కార్పొరేటర్లు కౌటం సతీష్‌, నాగరాజు, దూళికట్ట సతీష్‌, కందుల స్వరూపసతీష్‌, కన్నూరి భాగ్య, నెలకంటి రాము, ముస్తాఫా, శంకర్‌నాయక్‌, నాయకులు రాజిరెడ్డి, బొమ్మక రాజేష్‌, గుండేటి రాజేష్‌, పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్‌ అన్నారు. మధును పదవి నుంచి తొలగిం చాలన్నారు. స్పీకర్‌ను అవమా నించడమంటే యావత్‌ తెలం గాణ ప్రజలను అవమానిం చినట్లేనన్నారు. పాల మనోజ్‌, ధర్మయ్య, స్వామి, ఈనుగాల రాములు, రమేష్‌, రాజేశం, పాల్గొన్నారు.

అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ, మాజీ సీఎం కేసీ ఆర్‌ బహుజన వ్యతిరేకని డీసీసీ అధికార ప్రతినిధి, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్‌ అన్నారు. మండల కేం ద్రంలో కాంగ్రెస్‌ మండల అధ్య క్షుడు సింగం కిరణ్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి మానవహారం చేపట్టి బీఆర్‌ఎస్‌ జెండా దహనం చేశారు. అసెంబ్లీ రాకుండా ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల న్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): శాసన సభా స్పీకర్‌ గడ్డంప్రసాద్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు దూషించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్‌ చౌక్‌లో ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ మధును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, పీఏసీఎస్‌, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీనివాస్‌, వెంకన్న, నేతలు మంథని సత్యం, జనగామ నర్సింగరావు, చంద్రు రాయమల్లు, రాకేష్‌, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:23 AM