యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:27 AM
ఎన్నికల సమయంలో విద్యా ర్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపిం చారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో విద్యా ర్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లేందుకు శనివారం పెద్దపల్లిలో విద్యార్థులు, యువతతో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ కమాన్, జెండా చౌరస్తా, పెద్దమసీదు మీదుగా అమర్‌నగర్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడి నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు ర్యాలీ కొనసాగింది. మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ యేటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీని విస్మరించిందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వం విఫల మైందని ఆరోపించారు. యూత్ కమిషన్ ఏర్పాటు, యువతకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలను పట్టించు కోవడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా భరోసా, విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేస్తోందని మండిపడ్డారు. యువత భవిష్యత్‌కు బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి, యువజన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, పాల్గొన్నారు.