హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:21 AM
కాం గ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుం డా ప్రజలను మోసంచేసిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. హామీల అమలు వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేం దుకు నిర్వహించిన పోరుబాట విజయవంతంగా ముగిసిందన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుం డా ప్రజలను మోసంచేసిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. హామీల అమలు వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేం దుకు నిర్వహించిన పోరుబాట విజయవంతంగా ముగిసిందన్నారు. మంగళవారం పెద్దపల్లిలో ధర్నా శిబిరం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌లతో కలిసి మాట్లాడారు. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2500, స్కూటీ, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుభరోసా, హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిప త్రం ఇచ్చి నిరసన తెలిపారు. గ్రంథాలయ సం స్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి, పాల్గొన్నారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు బలప్రయో గానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు వ్యవహ రించిన తీరును నిరసిస్తూ బ స్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మె ల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం ఖండించాల్సిన విషయమన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మమతారెడ్డి పాల్గొన్నారు.
గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిపై దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ టీజం క్షన్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వ హించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నాయకులు కౌశికహరి, వ్యాళ్ల హరీష్‌రెడ్డి, మూల విజయా రెడ్డి, కర్క పద్మజ, మేకల సమ్మయ్య, రేణికుంట్ల సత్యవతి, మురళీధర్‌రావు,రమేష్, పాల్గొన్నారు.