Share News

అభివృద్ధిలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:42 PM

నియోజకవర్గం అభివృద్ధి చేయటంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పూర్తిగా విఫలమయ్యారని, పదేండ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులను తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవటం తప్ప వారు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, వ్యాళ్ళ హరీష్‌ రెడ్డిలు అన్నారు.

అభివృద్ధిలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం

అంతర్గాం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధి చేయటంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పూర్తిగా విఫలమయ్యారని, పదేండ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులను తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవటం తప్ప వారు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, వ్యాళ్ళ హరీష్‌ రెడ్డిలు అన్నారు. మండలంలోని పెండింగ్‌ పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. పెద్దంపేట, రాయదండీ గ్రామాల రైతులకు చెందిన కురూజ్కం భూముల పట్టాలను కేసీఆర్‌ పాలనలో జీఓ నెంబర్‌ 127 ద్వారా కొందరు రైతులకు ఇప్పించామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పట్టాలు ఇస్తామని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే ఎందుకు పట్టాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు. అంతర్గాం- మంచిర్యాల మధ్య గోదావరి నదిపైన వంతెన నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.164 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణ ప్రక్రియను నిలిపివేసిందని, ఆ నిధులను మళ్ళించారని ఆరోపించారు. మండల కేంద్రంలో ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికి పార్కు నిర్మాణానికి పూనుకోవటం లేదన్నారు. కూల్చివేతలు, బూడిద, మట్టి అమ్ముకోవటంలో ఎమ్మెల్యేకు ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో లేదని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని దుర్మార్గపు పాలన నడుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ జడ్పిటిసి అముల నారాయణ, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మినారాయణ, సర్పంచ్‌ అముల పెద్ద శ్రీనివాస్‌, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేకల సమ్మయ్య, మూల విజయారెడ్డి, మట్ట లక్ష్మి మహేందర్‌ రెడ్డి, కరివేద శ్రీనివాస్‌ రెడ్డి, కొలిపాక మధుకర్‌ రెడ్డి, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, నడిపెల్లి మురళీధర్‌ రావు, పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:42 PM