Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలుచేయాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:25 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యా లయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలుచేయాలి

జ్యోతినగర్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యా లయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ, రైతుభరోసా, పంటలకు బోనస్‌, రైతుకూలీలకు రూ.12 వేల సాయం అందించాలని కోరారు. నిరుద్యోగు లకు భృతి, ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయాలని డిమాం డ్‌ చేశారు. విద్యాభరోసా, పెండింగ్‌ ఫీజు బకాయిల చెల్లింపు, పెన్షన్లు అందించాలని కోరారు. రైతు డిక్లరేషన్లను అమలు చేయడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని సూచిం చారు. వ్యాల హరీశ్‌రెడ్డి, మూల విజయరెడ్డి, సమ్మయ్య, మారుతి, ఈదునూరి శ్రీకాంత్‌, ఈదునూరి అశోక్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:25 AM