బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:17 AM
బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరి స్తోందని ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ బీసీ సెల్ సమావేశం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో శని వారం ఆర్‌ఆర్ గార్డెన్ లో నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరి స్తోందని ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ బీసీ సెల్ సమావేశం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో శని వారం ఆర్‌ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. సమావేశానికి రమణతోపాటు పల్లె రవికుమార్ గౌడ్, బాలరాజ్‌యాదవ్ హాజరయ్యారు. రమణ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో గొల్ల, యాదవ, ముదిరాజ్, కాపు తదితర బీసీ వర్గా లతో పాటు అన్ని కులాల అభ్యున్నతికి కార్యక్ర మాలు చేపట్టినట్లు తెలి పారు. బీసీలకు రాజకీ యం గా, సామాజికంగా అవకాశా లు కల్పించామని పేర్కొ న్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో విఫలమైందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్ర మాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీల హక్కుల సాధన కోసం అన్ని బీసీ వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, మాజీ మార్కెట్ చైర్మన్, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, కొయ్యడ సతీష్, బీసీ సెల్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో బాహాబాహీ
కాగా, సమావేశంపై అందరికీ సమాచారం ఇవ్వలేదని దాసరి ఉషా, గంట రాములు వర్గీయులు దాసరి మనోహర్‌రెడ్డి వర్గీయులు మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరిపై ఒకరు తోసుకుంటూ కుర్చీలు విసురుకుంటూ దూష ణలకు దిగారు. దాసరి మనోహర్‌రెడ్డి ఒంటెద్దు పొకడ పోతున్నాడని, బీసీల విస్మరించి వ్యవహరిస్తున్నాడని, అగ్రకులాలకు పెద్దపీట వేస్తూ బీసీలను అవమాన పర్చుతున్నాడని, దాసరి మనోహర్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఉషా, గంట రాములు వర్గీయులను సమావేశం నుంచి తరిమికొట్టారు. అనంతరం సమావేశం నిర్వహించారు. సుమారు గంట పాటు ఉద్రిక్తత కొనసాగింది.