Share News

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:13 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు.

 హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

పెద్దపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేటీఆర్‌ ప్రకటించిన వారం రోజుల పోరుబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన అవగాహన సదస్సులో సెప్టెంబర్‌ 2 నుంచి చేపట్టనున్న కార్యక్రమాలపై మూడు గంటల పాటు దిశానిర్దేశం చేశారు. 2న ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ధర్నా, 3న రైతు సదస్సులు, 4న మహిళలు, వికలాంగులతో కార్యక్రమాలు, 5న విద్యార్థులు, యువతతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 6న గ్రామీణ, పట్టణ సమస్యలపై నిరసనలు, 7న ప్రజావాణిలో వినతిపత్రాల సమర్పణ, 8న జిల్లా స్థాయి ప్రెస్‌మీట్‌ నిర్వహించాలని తెలిపారు. 10న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిరసనలకు సంఘీభావం ప్రకటించాలని సూచించారు. ప్రతి గ్రామం, మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఉప్పు రాజు కుమార్‌, మర్కు లక్ష్మన్‌, కౌన్సిలర్లు సుజాత రవీందర్‌, ఓదెలు పార్టీ నాయకులు వంగల తిరుపతి రెడ్డి, నూనేటి సంపత్‌, స్రవంతి మోహన్‌ రావు, రాంరెడ్డి, మల్లేశం, దేవయ్య, బోయిని రాజమల్లు, పారుపెల్లి గుణపతి, సలెంద్ర రాములు, తీగల సదయ్య, పూదరి చంద్రశేఖర్‌, పెంచాల శ్రీధర్‌, మోహన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 12:13 AM