హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:36 PM
మూడేళ్ళ కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తున్న రామగుండం పోస్ట ర్‌ను బీజేపీ నాయకులు విడుదల చేశారు. ఆదివా రం ఎఫ్‌సీఐ గౌతమినగర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్యఅరుణ్ కుమార్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కోల్‌సిటీటౌన్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మూడేళ్ళ కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తున్న రామగుండం పోస్ట ర్‌ను బీజేపీ నాయకులు విడుదల చేశారు. ఆదివా రం ఎఫ్‌సీఐ గౌతమినగర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్యఅరుణ్ కుమార్ పోస్టర్‌ను విడుదల చేశారు. వారు మాట్లా డుతూ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో నెరవేర్చ లేకపోయిందని విమర్శిం చారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి పనుల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజల సమస్య లను వెలుగులోకి తీసుకురావ డంతో పాటు ప్రజల పక్షాన పోరాటం చేయడమే కార్యక్ర మం ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. నాయకులు సుల్వలక్ష్మీనర్సయ్య, మహా వాది రామన్న, మామిడి రాజేష్, మాతంగి రేణుక, దాసరి శ్రీనివాస్, పెద్దపల్లి పవన్, శ్రీరాముల సత్యం, బాణాల రంజిత, మచ్చ విశ్వాస్, భారతి, పవన్, సతీష్, కొమ్మ స్వామి, సృజన, రజిత, పాల్గొన్నారు.