Share News

ఎన్నికల కమిషన్‌ తీరుపై కాంగ్రెస్‌ ధర్నా

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:53 PM

జాతీయ ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల కమిషన్‌ తీరుపై కాంగ్రెస్‌ ధర్నా

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి):జాతీయ ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విజయరమణ రావు మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు అడ్డదారుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈసారి ’ఎస్‌ఐఆర్‌‘ కార్యక్రమం పేరుతో తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలిపై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ కమిషన్‌ పనితీరులో మార్పు రాలేదన్నారు. ఎన్నికల కమిషన్‌ చర్యల కారణంగా దేశంలో 13 కోట్ల ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఒక్కటై గళం విప్పాలని పిలుపునిచ్చారు. నూగిళ్ళ మల్లయ్య, మందల సత్యనారాయణరెడ్డి, అంతటి అన్నయ్యగౌడ్‌, మినుపాల ప్రకాష్‌, సుధాకర్‌రెడ్డి, పాగాల శ్రీకాంత్‌, మంథెన నర్సింగ్‌, అమ్రీష్‌, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, కొమ్ము శ్రీనివాస్‌, తదితరులున్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): ఓటు చోరీపై కాంగ్రెస్‌ పార్టీ కదం తొక్కింది. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకే కాంగ్రెస్‌ సమరం నిర్వహిస్తుందని రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ మహంకాళి స్వామి చెప్పారు. సోమవారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎండీ ముస్తాఫా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులతో నిరసన నిర్వహించి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మేయర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన సంస్థ కాదని, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సర్‌ పేరుతో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న తీరుపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అర్హులైన ఓటర్ల పేరు తొలగిపోకుండా ఓటు హక్కు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఉన్న అధికారమని, ఆ అధికారాన్ని ఎవరూ బలహీనపర్చడానికి వీలు లేదన్నారు. సర్‌ ప్రక్రియలో బీజేపీ రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, జ్ఞానేశ్వర్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 28 , 2026 | 11:53 PM