పదేళ్లుగా మంచినీళ్లు ఇవ్వడం చేతకాక కాంగ్రెస్‌పై విమర్శలు
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:46 PM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రామగుండం ప్రజలకు మంచినీరు ఇవ్వడం చేతకాక ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, కౌశిక హరి ఒక సైకోలా తిరుగుతున్నాడని మేయర్ మహం కాళి స్వామి విమర్శించారు. మంగళవారం గోదావరి ఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్, కార్పొరేటర్లు మాట్లాడారు
కోల్‌సిటీ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రామగుండం ప్రజలకు మంచినీరు ఇవ్వడం చేతకాక ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, కౌశిక హరి ఒక సైకోలా తిరుగుతున్నాడని మేయర్ మహం కాళి స్వామి విమర్శించారు. మంగళవారం గోదావరి ఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్, కార్పొరేటర్లు మాట్లాడారు. పదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలుగా కోరుకంటి చందర్, సోమారపు సత్య నారాయణలు వ్యవహరించారన్నారు. గతంలో వేసవి వచ్చిందంటే కార్మిక సంఘాలు, కుటుంబాలు జీఎం కార్యాలయం, మున్సిపల్ ఎదుట ధర్నా చేసేవని, రెం డేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వ ర్యంలో ఎక్కడా నీటి కొరత లేకుండా సమస్యలు పరి ష్కరిస్తున్నారన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ర్యాపిడ్ ఫిల్టర్‌బెడ్ అంచనాలు పెరిగినందున అదనపు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, తాను సింగ రేణి సీఎండీ బుద్ధప్రకాష్‌ను కలిసి మాట్లాడామ న్నారు. తమకు ఆక్రమణలు కూల్చివేయడమే కాదు పేద ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేయడం తెలుసన్నారు. చౌరస్తాకు వెళ్లి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మా ణాలను పరిశీలించాలన్నారు. నగరంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, క్యాత్ ల్యాబ్ ఏర్పాటు జరుగుతుందన్నారు. కౌశిక హరి కొన్నే ళ్లుగా బూడిద, మట్టి దందాలు చేస్తున్నాడని, ఆయన చేసిన మాఫియా ఇతరులు చేస్తారనుకోవడం పొర పాటాన్నారు. జెన్‌కో ల్యాండ్‌లను కబ్జా చేసి బతుకు తున్నాడన్నారు. బీఆర్‌ఎస్‌లో చందర్, హరీష్‌రెడ్డి, కౌశిక హరి వర్గాలు పోటీ పడుతున్నాయన్నారు. రామగుండం అర్బన్‌లో త్వరలో ఇండ్ల నిర్మాణం జరు గనున్నాయని, ఇప్పటికే కొన్ని ఇండ్ల నిర్మాణం పురో గతిలో ఉందన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పా రపు శ్రీనివాస్, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్, ముస్తా ఫా, నెలకంటి రాము, ఫజల్ బేగ్, సత్యప్రసాద్, సాం బమూర్తి, రవి, సాగి సంతోష్‌రావు, నాయకులు దాసరి విజయ్, కల్వల రంజిత్, గడ్డం శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, గంగ శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.