కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టాలి
ABN , Publish Date - May 07 , 2026 | 11:46 PM
కాంగ్రెస్, బీజేపీ చేసుకున్న లోపాయికారి ఒప్పందాన్ని బయట పెట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతిపక్షాలను కాంగ్రెస్, బీజేపీలు దాడులకు దిగుతున్నాయని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెట్టడం, పరుషపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.
గోదావరిఖని, మే 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీజేపీ చేసుకున్న లోపాయికారి ఒప్పందాన్ని బయట పెట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతిపక్షాలను కాంగ్రెస్, బీజేపీలు దాడులకు దిగుతున్నాయని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెట్టడం, పరుషపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరిట గోదావరినదిని ఎండబెట్టి రైతులకు నీళ్లు ఇవ్వకుండా చేసిందని, కొత్తగా మళ్లీ విద్యుత్‌పై విచారణ అంటూ నాటకాలు మొదలు పెట్టిందని, ఓట్లు వేసిన ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు ఉంటే ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమంలో భాగస్వామ్యులు కారని, కాంగ్రెస్ పాలనపై మాట్లాడకపోవడం, కేంద్రం నిధులపై ప్రశ్నించకపోవడం వారి లోపాయికారి ఒప్పందానికి అద్దం పడుతుందన్నారు. కేటీఆర్ కరీంనగర్‌కు వచ్చిన సందర్భంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, బంగారం షాపులో దొంగతనంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఎంపీ కేటీఆర్‌పై దూషించడం సరైంది కాదన్నారు. కేటీఆర్ ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో బండి సంజయ్ దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అకాల వర్షంతో ధాన్యం కొట్టుకుపోయి సంచుల కొరత ఏర్పడితే వాటిని తీర్చలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, జనగామ కవిత, నారాయణదాసు మారుతి, సట్టు శ్రీనివాస్, ఐలయ్య పాల్గొన్నారు.