ప్రజాస్వామ్యంపై దాడిని ఖండించాలి
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:29 PM
ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండించాలని, నీట్ పరీక్ష రద్దుకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పెద్దపల్లి టౌన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండించాలని, నీట్ పరీక్ష రద్దుకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్ష లీక్ చేసిన దోషులను శిక్షించాలని విద్యార్థులు, మేధావులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తుంటే వారిపై దాడిని సీపీఐ ఖండిస్తుందని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. పెద్దపెల్లి, భూపాలపల్లి జిల్లాల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి కష్టాలు తప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తుమ్మడిహెట్టి వద్ద డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఆగస్టులో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రను చేపడుతున్నామన్నారు. జిల్లా సహా కార్యదర్శి గోశిక మోహన్, కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, కే.కనకరాజ్, తాళ్లపల్లి మల్లయ్య, కోడం స్వామి, తాళ్లపల్లి లక్ష్మణ్, మార్కాపురి సూర్య తదితరులు పాల్గొన్నారు.