Share News

గ్రామాల సమగ్రాఅభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:42 PM

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళి కలను రూపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ లో మాట్లాడారు.

గ్రామాల సమగ్రాఅభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి

పెద్దపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళి కలను రూపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ లో మాట్లాడారు. గ్రామ వనరులను వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలోపేతం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతి పదికన నిర్వహించాలని, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతీ ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా జాబ్‌ కార్డు కలిగిన ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల పనిదినాలు కల్పించాలని ఆదేశించారు. వీఓ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతీ గ్రామ పంచాయతీ రాబోయే మూడు సంవత్సరాల కాలానికి సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందిం చుకోవాలని, ఇది కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు జరిగేలా సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోరారు. జడ్పీ సీఈఓ నరేందర్‌, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజేశ్వర్‌, అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల రుణాలను పెండింగ్‌లో పెట్టవద్దు

ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రుణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచ కుండా అర్హులైన వారికి వెంటనే మంజూరు చేసి యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని, తిరస్కరించాల్సి వస్తే సరైన కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. గురు వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల కింద వచ్చే రుణ దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండిం గ్‌లో ఉంచరాదని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేసి యూనిట్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, తిరస్కరించే దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని ఆదేశిం చారు. 2025-26లో వ్యవసాయ పంట రుణాల లక్ష్యంలో ఇప్పటివరకు 77 శాతం మాత్రమే సాధించామని, 91,002 మంది రైతులకు రూ.1488 కోట్ల పంట రుణాలు అందించినట్లు తెలిపారు. పీఏసీఎస్‌ గోదాముల నిర్మాణా నికి అవసరమైన రుణాలను అత్యవసరంగా మంజూరు చేయాలని, భూముల కేటాయింపు త్వరలో పూర్తవుతుందని, నిర్మాణ పనులు ప్రారంభించేలా బ్యాంకులు సహకరించాలని కలెక్టర్‌ తెలిపారు. ఎల్‌డీఎం ప్రవీణ్‌ కుమార్‌, నాబార్డ్‌, ఆర్బీఐ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల జిల్లా సమన్వయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 11:42 PM