Share News

మెగా జాబ్‌మేళా నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు

ABN , Publish Date - May 05 , 2026 | 12:08 AM

జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ ఫంక్షన్‌ హాల్‌లో ఈ నెల 6న నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన డీసీపీ రాంరెడ్డితో కలిసి జాబ్‌మేళా వేదికను ఆయన పరిశీ లించారు.

మెగా జాబ్‌మేళా నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు

పెద్దపల్లి కల్చరల్‌, మే4(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ ఫంక్షన్‌ హాల్‌లో ఈ నెల 6న నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన డీసీపీ రాంరెడ్డితో కలిసి జాబ్‌మేళా వేదికను ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న సుమారు 100 కంపెనీలు పాల్గొనున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో యువత హాజరువుతారని, తగిన ఏర్పాట్లు చేయాలని, పలు అంశా లను సూచించారు. కుర్చీలు, తాగునీటి సదుపాయాలు, అభ్యర్థుల నమోదు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తగిన సంఖ్యలో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, వైఫై సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరాపై అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఉపాధికల్పనాధికారి రాజశేఖర్‌, డీవైఎస్‌ఓ సురేష్‌, ఆర్డీఓ గంగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:08 AM