కల్తీలేని ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:15 AM
కల్తీలేని ఆహారం తీసుకుంటేనే ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ పాల్గొని మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కల్తీలేని ఆహారం తీసుకుంటేనే ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ పాల్గొని మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కల్తీ ఆహారం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతున్నారు. నూనె వాడకాన్ని తగ్గిస్తే గుండె జబ్బు లు రాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. మొదటి దఽశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే మెరుగైనా చికిత్స వల్ల ఆరోగ్యవంతులం కావచ్చన్నారు. హెల్త్ క్యాంపులో బిపి, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే దిశగా కార్యాచ రణ అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇందిర మహిళా శక్తి కింద ఉన్న లక్షా 20 వేల మహిళలకు హెల్త్ చెకప్ చేస్తూ వారికి డిజిటల్ హెల్త్‌కార్డులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఈనెల 15 వరకు గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ ప్రత్యేక కార్యాచ రణ అమలు చేస్తున్నామని, పెండింగ్ ఉన్న ఫైల్స్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్, తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు చామంతి-శ్రీ కాంత్, గంట రమేష్, వైద్యురాలు మమత పాల్గొన్నారు.