Share News

ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:36 PM

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని చట్ట పరిధిలో సత్వర పరిష్కారం అం దించడమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌డేను నిర్వ హిస్తున్నామని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలి

కోల్‌సిటీ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని చట్ట పరిధిలో సత్వర పరిష్కారం అం దించడమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌డేను నిర్వ హిస్తున్నామని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమ వారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల నుంచి వచ్చిన ఫిర్యాదులను సీపీ తెలుసుకొని సంబంధిత అధికారు లతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యా దపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే స్పందించాలని సూచించారు. ఫిర్యా దుల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజ ల్లో పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం పెంపొందించే విధంగా విధు లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డీసీపీ (అడ్మిన్‌) కే శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:36 PM