Share News

కలర్‌ ఫుల్‌ జోష్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:41 PM

యువత కేరింతలు, నృత్యాలు, చిన్నారుల సందడి మధ్య జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు మంగళవారం వైభవంగా సాగాయి. ఉదయం నుంచే గ్రామాల నుంచి పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. మున్సిపల్‌ కౌన్సిల్‌, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్నీ వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములయ్యారు.

కలర్‌ ఫుల్‌ జోష్‌

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): యువత కేరింతలు, నృత్యాలు, చిన్నారుల సందడి మధ్య జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు మంగళవారం వైభవంగా సాగాయి. ఉదయం నుంచే గ్రామాల నుంచి పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. మున్సిపల్‌ కౌన్సిల్‌, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్నీ వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములయ్యారు. వివిధ వాడల్లో డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేశారు. యువకులు బైక్‌లపై తిరుగుతూ రంగులు చల్లుకోవడంతో సందడి వాతావరణం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. యువతీ, యువకులు, చిన్నారులు రంగులు పట్టుకొని ఆయా కాలనీల్లో తిరుగుతూ ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా హోలీ సంబరాలు చేసుకుంటూ రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. ఐటీఐ గ్రౌండ్‌ వాకర్స్‌ జూనియర్‌ కళాశాల మైదానం వాకర్స్‌ మినీ ట్యాంక్‌ బండ్‌ ఎల్లమ్మ చెరువు వాకర్స్‌ ఆయా ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్నారు. బ్యాండ్‌ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా కేరింతలు కొడుతూ పాటలు పాడుకున్నారు. జెండా కూడలి కమాన్‌ చౌరస్తా, ప్రగతినగర్‌ చౌరస్తా, శాంతినగర్‌, భూంనగర్‌, అమర్‌నగర్‌, కూనారం క్రాస్‌రోడ్డు చౌరస్తాలలో ఎక్కడ చూసినా యువతీ, యువకుల కేరింతలతో సందడి నెలకొంది.

వాకర్స్‌ హోలీ సంబరాలు...

పట్టణంలో మార్నింగ్‌ వాకర్స్‌ నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. రంగుల పండుగను ఎంతో ఉత్సాహాంగా, సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న వాకర్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హోలీ వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం రంగులమయంగా మారింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాకర్స్‌ అంతా ఒకరిపై ఒకరురంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. డీజేపాటలు, నృత్యాలతో మైదానమంతా హోరెత్తిపోయింది. వాకర్స్‌ అన్నాడి వెంకటరెడ్డి, తిరుపతి, అంజన్న, తిరుమల్‌, చందా శ్రీనివాస్‌, నరసింహస్వామి, వీరన్న, విజేందర్‌, సత్తన్న, ధర్మన్న, మహేష్‌, కిరణ్‌, రమేష్‌, కృష్ణమూర్తి, పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:41 PM