Share News

డిజిటల్‌ పర్యవేక్షణలో బొగ్గు రవాణా జరుగుతుంది

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:34 AM

సింగరే ణి బొగ్గు రవాణాలో ఒక్క టన్ను కూడా చౌ ర్యం జరిగే ఆస్కారం లేదని, పూర్తి స్థాయిలో డిజిటల్‌ పర్యవేక్షణలోనే రవాణా జరుగుతుం దని రీజియన్‌ జీఎం సూజయ్‌ మోజుందర్‌, ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధుసూధన్‌, బండి సత్యనారాయణలు తెలిపారు. సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.

డిజిటల్‌ పర్యవేక్షణలో బొగ్గు రవాణా జరుగుతుంది

రామగిరి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): సింగరే ణి బొగ్గు రవాణాలో ఒక్క టన్ను కూడా చౌ ర్యం జరిగే ఆస్కారం లేదని, పూర్తి స్థాయిలో డిజిటల్‌ పర్యవేక్షణలోనే రవాణా జరుగుతుం దని రీజియన్‌ జీఎం సూజయ్‌ మోజుందర్‌, ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధుసూధన్‌, బండి సత్యనారాయణలు తెలిపారు. సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ సింగరేణి కాలరీస్‌ కంపెనీ మైనింగ్‌ రంగంలో 137 సంవత్సరాల చరిత్రను కల్గి ఉందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు చౌర్యం జరిగిందని అవాస్తవ ఆరోపణలు వస్తున్నాయన్నారు. దీం తో వేలాది మంది కార్మికుల, అధికారుల మనో ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొ న్నారు. సింగరేణిలో 100 శాతం బొగ్గు రవా ణాలో 85 శాతం మేర బొగ్గు రైల్వే మార్గంలో మిగతా 15 శాతం రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. విని యోగదారుడికి చేరే వరకు ప్రతీ దశలో డిజి టల్‌ పర్యవేక్షణ, భద్రతా, తనిఖీలు, ఆన్‌లైన్‌ రికార్డింగ్‌ వ్యవస్థలు అమల్లో ఉంటాయని తెలిపారు. నేరుగా హైదరాబాద్‌ మార్కెటింగ్‌ విభాగం ద్వారా ఎస్‌ఏపి ఆధారిత వ్యవస్థలో బొగ్గు కేటాయింపులు జరుగుతాయని వెల్ల డించారు. వాహనం నెంబర్‌, విని యోగదారుడి వివరాలు ఎస్‌ఏపి వ్యవస్థలో నమోదు చేస్తా మన్నారు. వాహనాలకు సంబంధించిన వివ రాలు జీపిఆర్‌ఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ లో ఉంటాయని తెలిపారు. ప్రతీ టన్ను బొగ్గు రవా ణలో ఆర్‌ఎఫ్‌ఐడి, జీపిఎస్‌, సిసి టివి, కోల్‌నెట్‌, ఎలకా్ట్రనిక్‌ వేబ్రిడ్జిలు, సింగరేణి సెక్యూరిటి, ఫ్లయింగ్‌ స్వాడ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ వం టి బహుళ సాంకేతికత మధ్య రవాణా జరుగు తుందని పేర్కొన్నారు. అవాస్తవ ఆరోపణలతో అధికారుల, కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు రామ్మోహన్‌, సుదర్శనం, షబ్బీరుద్దీన్‌, రాజేశ్వరి, ఆసీఫ్‌యాసిన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:34 AM