బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ప్రారంభించాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:59 PM
కోల్ ఇం డియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి.
గోదావరిఖని, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కోల్ ఇం డియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. సింగరేణిలో జూలై 1న నిర్వ హించనున్న కార్యాచరణపై గోదావరిఖనిలో జేఏసీ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ జనక్ ప్రసాద్, సీఐటీయూ రాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్ సారయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను బొగ్గు పరిశ్రమలో అమలు చేయాలని చూస్తోందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గని కార్మికులకు అత్యంత కీలకమైన 12వవేతన ఒప్పంద ప్రక్రియను లేబర్ కోడ్ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదని, కేంద్ర ప్రభు త్వం, కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే చర్చలు ప్రారంభించి కార్మి కులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, 12వ వేతన ఒప్పందం కోసం ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈనెల 29న శ్రీరాంపూర్, భూపాల పల్లిలో గేట్ మీటింగ్, 30న కొత్తగూ డెంలో గేట్ మీటింగ్, జూలై 1న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, కే స్వామి, రంగు శ్రీను, నరసింహరెడ్డి, ధర్మపురి, రాజమౌళి, అనిల్‌రెడ్డి ఏఐటీయూసీ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.