Share News

సీఎం సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:00 AM

రైతుల సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం నిబద్దతతో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి క్యాంపు ఆఫీసులో నియోజకవర్గంలోని కాటారంలో ఆదివారం జరిగే సీఎం పర్యటనపై పార్టీ నేతలతో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సమీక్షించారు.

సీఎం సభను విజయవంతం చేయాలి

మంథని, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం నిబద్దతతో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి క్యాంపు ఆఫీసులో నియోజకవర్గంలోని కాటారంలో ఆదివారం జరిగే సీఎం పర్యటనపై పార్టీ నేతలతో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవం త్‌రెడ్డి కాటారంలో రెండో విడుత రైతుభరోసాను విడుదల చేస్తారన్నారు. రైతుభరోసా పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు.

సీఎంతోపాటు ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు వస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయటానికి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని విజయవం తం చేయటానికి అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:00 AM