క్రీడా రంగానికి సీఎం అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:39 AM
క్రీడా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలో కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్ ప్రారంభించారు.
సుల్తానాబాద్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): క్రీడా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలో కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఏషియన్ క్రీడల్లో రాణించిన ఆర్చరీ క్రీడాకారిణి చికితను ఆదర్శంగా తీసుకొని క్రీడా కారులు ముందుకెళ్లాలని సూచించారు. చికిత రెండు గోల్డ్‌మెడలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యా తులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారని స్పష్టం చేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రీమియం లీగ్‌ను నిర్వహించడం అభినందించదగ్గ విషయమ న్నారు. కౌన్సిలర్ సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నా యని, నియోజకవర్గ స్థాయిలో పది టీములు నమోదు చేసుకొని, క్రికెట్ పోటీలో పాల్గొంటున్నారని తెలి పారు. మున్సిపల్ చైర్మన్‌లు బిరుదు రాధాకృష్ణ, నూగిళ్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ సామ రాజేశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుగ్యాల సంతోష్ రావు, ఎలిగేడు సర్పంచ్ కప్పల ప్రవీణ్, కాట్నపల్లి సర్పంచ్ ఓగుల పూజా రాజేందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.