ఆలయాల మూసివేత
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:47 PM
పట్టణంలోని పలు ఆలయాలను చంద్రగహం సందర్భంగా మంగళవారం ఉదయం పూజారులు మూసి వేశారు. సాయంత్రం చంద్రగ్రహణం కావడంతో ఉదయం వేళలోనే ఆల యాల్లో సాయంత్రం, రాత్రి నిర్వహించే వైదిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆలయాలను మూసి వేశారు.
మంథని, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ఆలయాలను చంద్రగహం సందర్భంగా మంగళవారం ఉదయం పూజారులు మూసి వేశారు. సాయంత్రం చంద్రగ్రహణం కావడంతో ఉదయం వేళలోనే ఆల యాల్లో సాయంత్రం, రాత్రి నిర్వహించే వైదిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆలయాలను మూసి వేశారు. దీంతో పట్టణంలోని పలు ఆలయాలు మూసి వేశారు. ఇండ్లలో గ్రహణ శాంతి నియమాలను పలువురు పాటించారు. బుధవారం తెల్లవారుజామున ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం భక్తల దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం నిత్య పూజల అనంతరం మూసివేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో కొందరు నదీ స్నానాలను ఆచరించారు. గృహాలలో గురువుల ద్వారా ఉపదేశం తీసుకున్న మంత్రాలను జపించారు. గ్రహణం పట్టు, విడుపు స్నానాలు ఆచరించి ఇండ్లను శుద్ధి చేసుకున్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని అర్చకులు మూసివేశారు. గ్రహణ దోషం వల్ల ఆలయంలో పూజలను, దర్శనాన్ని నిలిపి వేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులకు 7.30 గంటలకు పూజలు భక్తులకు దర్శ నం ఉంటుందని ఈవో సదయ్య, అర్చకుడు వీరభద్రయ్య తెలిపారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పలు ఆలయాలను అర్చకులు, పండితులు మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భాన్ని పురస్క రించుకుని మండల కేంద్రంలోని వరాహస్వామి ఆలయంతోపాటు వేణు గోపాలస్వామి తదితర ఆలయాను మూసివేశారు. అర్చకులు రామాంజనే యులు, హర్షవర్దన్, సిబ్బంది ప్రదీప్, నర్సింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు.